హైదరాబాద్ : కాజీపేట – ఢిల్లీ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు మంగళవారం తీవ్ర అంతరాయం కలిగింది. పలు స్టేషన్లలో నాలుగు గంటల పాటు ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోయాయి. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల, పొత్కపల్లి, కొలనూరు రైల్వేస్టేషన్లలో రైళ్లు నిలిచాయి.
కాజీపేట – ఢిల్లీ మార్గంలో మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా రైళ్లు నిలిచిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా స్టేషన్లలో తినడానికి ఏమి దొరకక, కనీసం తాగునీరు సౌకర్యం కూడా సరిగా లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
తమిళనాడు ఎక్స్ప్రెస్ రెండున్నర గంటలు, సంపర్క్ క్రాంతి 5 గంటలు, కేరళ ఎక్స్ప్రెస్ 7 గంటలు, తిరునవేలి ఎక్స్ప్రెస్ 6 గంటలు, యశ్వంత్పూర్ – దురంతో ఎక్స్ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా నడిచాయి.