హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఉద్యానశాఖ ఆధ్వర్యంలో అర్బన్ ఫామింగ్ పథకంలో భాగంగా ఇంటి ఆవాసాలపై(మిద్దెలపై) కూరగాయల పెంపకం మీద శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా తెలిపారు. ఈనెల 25న (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ శిక్షణ నిర్వహించనున్నట్టు చెప్పారు.
ఆసక్తిగల వారు రూ.100 ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు నాంపల్లిలోని రాష్ట్ర ఉద్యాన శిక్షణ కేంద్రంలో లేదా 8977714411, 8688848714 నంబర్లలో సంప్రదించాలి.