హైదరాబాద్, మార్చి 20, (నమస్తే తెలంగాణ) : నిరుడు పదోన్నతి పొందిన టీచర్లకు సర్కారు శిక్షణ ఇవ్వనున్నది. ఈ మేరకు ఏప్రిల్ 3,4 తేదీల్లో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
ఏప్రిల్ 3న ఉర్దూ మీడియం టీచర్లకు హైదరాబాద్లో శిక్షణ ఇవ్వనున్నారు.