ములుగు : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకొని వస్తున్న భక్తుడిపై ట్రైనీ ఎస్సై చేయి చేసుకున్న సంఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా చౌరస్తాలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై భక్తుడిపై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. కుటుంబ సమేతంగా మేడారం వెళ్లి తల్లులను దర్శించుకొని వస్తున్న భక్తుడిని వాహనాల తనిఖీలో భాగంగా పస్రా పోలీస్ స్టేషన్కు చెందిన ట్రైనీ ఎస్సై సతీశ్ ఆపాడు. భక్తుడు ఎస్సైతో వాగ్వివాదం చేస్తున్న క్రమంలో ఓపికగా సమాధానం చెప్పాల్సిన ఎస్సై సతీశ్ సహనం కోల్పొయి భక్తుడిని కుటుంబ సభ్యుల ముందే చెంప ఛెల్లుమనిపించాడు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది. కాగా, భక్తుడిపై ట్రైనీ ఎస్సై చేయి చేసుకోడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు పేర్కొన్నారు.
కుటుంబంతో మేడారం వెళ్లి వస్తున్న వ్యక్తి మీద ఎస్ఐ దాడి
మహిళలు, కుటుంబ సభ్యులు వేడుకుంటున్నా పట్టించుకోకుండా లాగి కొట్టిన ములుగు జిల్లా పస్రా మండల ఎస్ఐ పుట్ట సతీష్ pic.twitter.com/GuuVTM3vj0
— Telugu Scribe (@TeluguScribe) September 14, 2025