హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని దాదాపు 71 రైళ్లకు సంబంధించిన టైంటేబుల్ మారినట్లు బుధవారం రైల్వే అధికారులు ప్రకటించారు. మారిన కొత్త టైంటేబుల్ జనవరి 1, 2022 నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు ప్రకటించారు. పూర్తి వివరాలు రైల్వే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
భవానీ దీక్ష భక్తుల కోసం విజయవాడ-పలాస స్టేషన్ల మధ్య ఈ నెల 24, 25 తేదీలలో రెండు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు బుధవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లు ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరాల మీదుగా నడుస్తుందన్నారు.
సికింద్రాబాద్-కాకినాడ టౌన్- వికారాబాద్ స్టేషన్ల మధ్య ఈ నెల 24, 26 తేదీలలో రెండు స్పెషల్ రైళ్లను నడుపనున్నట్లు బుధవారం ఎస్సీఆర్ జోన్ అధికారులు ప్రకటించారు. నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, భీమవరం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్ల మీదుగా నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.