రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్లలో విషాదం (Tragedy) నెలకొని ఉంది. వృద్ధ దంపతుల ఆత్మహత్య కలకలం రేపుతుంది. జిల్లాలోని చందుర్తి మండలం అశిరెడ్డి పల్లె గ్రామంలో కనికపరపు దేవయ్య, లక్ష్మి దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు.
గ్రామస్తులు, పోలీసులు తెలిపన వివరాల ప్రకారం .. ఆస్తి పంపకాల విషయంలో కొంతకాలంగా కొడుకులతో విభేదాలున్నాయని తెలిపారు. వారి వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం దంపతులు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు గమనించి వేములవాడ ఏరియా ఆసుపత్రి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందారని వారిని పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు.