మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. పాలేరు వాగులో విద్యార్థి గల్లంతు
Crime news | మహబూబాబాద్ జిల్లాలోని పాలేరు వాగులో విద్యార్థి గల్లంతయ్యాడు.
మహబూబాబాద్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాలేరు వాగులో పడి ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద ముప్పారం పాలేరు వాగులో ప్రచండ(16) అనే విద్యార్థి గల్లంతయ్యాడు. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నిన్న స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ప్రచండ… ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయాడు. ప్రచండ తల్లిదండ్రులు తమ కొడుకు ఎక్కడని ప్రచండ స్నేహితులను నిలదీయటంతో గల్లంతైన విషయాన్ని స్నేహితులు బయటపెట్టారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో ప్రచండ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

