హైదరాబాద్: బతుకమ్మ (Batukamma) సంబురాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు. చివరిరోజైన ఆదివారం సద్దుల బతుకమ్మను (Saddula Batukamma) ట్యాంక్‌బండ్‌పై ఘనంగా నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. పలు రూట్లలో వాహనాలను మళ్లించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 గంటల వరకు లుంబినీ పార్కు, అప్పర్ ట్యాంక్‌బండ్ చుట్టూ ఎలాంటి వాహనాలను నిలిపివేయనున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.