హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఓటు వేయడానికి(Parliament elections) సొంతూర్లకు వెళ్లిన ప్రజలు తిరిగి నగర బాట పట్టారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో మంగళవారం తెల్లారేసరికి నగరానికి చేరుకున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై(Vijayawada Highway) వాహనాల రద్దీ(Traffic) కొనసాగుతున్నది. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బీజేఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లలో రద్దీ నెలకొంది.
దీంతో హైదరాబాద్ మెట్రో రద్దీగా మారింది. రైలు రావడమే ఆలస్యం బోగీలన్ని నిండిపోతున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు అరగంట ముందుగానే సర్వీసులను ప్రారంభించారు. ముఖ్యంగా ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్లే మెట్రోలో రద్దీ పెరిగింది. దీంతో ఎక్కువ ట్రిప్పులు నడపాలని అధికారులు నిర్ణయించారు.
Traffic,