హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని రెండు కార్లు ఢీకొట్టాయి. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో హైవేపై 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాలను రోడ్డుపైనుంచి తొలగించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.