Traffic Diversion | సూర్యాపేట జిల్లా కోదాడలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవేపైకి చేరిన వరద నీరు చేరింది. దాంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వెళ్లే వాహనాలను ఖమ్మం వైపుగా అధికారులు మళ్లించారు. హైదరాబాద్ – విజయవాడ హైవేపై కోదాడ బైపాస్‌లో భారీ నిలిచిన వాహనాలిచాయి. వాహనాలు ఎందుకు నిలిచిపోయాయో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. అలాగే జగ్గయ్యపేట వద్ద రోడ్డు బ్లాక్ అయ్యింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు నార్కట్‌పల్లి నుంచి వయా మిర్యాలగూడ, గుంటూరు మీదుగా విజయవాడకు ట్రాఫిక్‌ను మళ్లించారు.
హైవే వెంట ట్రాఫిక్ నేపథ్యంలో ఇబ్బందులు ఏర్పడకుండా వాహనదారులు నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని పోలీసులు సూచించారు. హైవే వెంట అధిక వాహనాలు వెళ్తున్న క్రమంలో రోడ్డు పక్కన ఉన్న గ్రామాల ప్రజలు ప్రమాదాల గురుకాకుండా జాగ్రత్తలు పాటించాలన్న నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. ఇదిలా ఉండగా.. సూర్యాపేట జిల్లాలో శనివారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెరువులు నిండి అలుగులుపారుతున్నాయి. అత్యధికంగా లక్కవరం రోడ్లో అత్యధికంగా 27.3 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. అలాగే, చిలుకూర్లో 26.7, మట్టంపల్లిలో 24, కోదాడలో 17, రఘునాథపాలెంలో 15, బాలారంతండా 14 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది.