ఇప్పటికే రూ.250 కోట్ల వరకు జరిమానాలు వసూలు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 29 : పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్‌కు పోలీసు శాఖ ఇచ్చిన డిస్కౌంట్ అఫర్ రెండు రోజుల్లో ముగుస్తున్నది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు భారీ ఊరటనిస్తూ ఈ నెల 1 నుంచి రాయితీతో చలాన్లు క్లియర్ చేసుకొనేందుకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. మంగళవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా రూ.250 కోట్లు వసూలయ్యాయి. ఇందులో 80 శాతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనివే ఉన్నాయి. డిస్కౌంట్ చివరి తేదీ దగ్గరపడుతుండటంతో చలాన్లు క్లియర్ చేసుకొనేందుకు వాహనదారులు ఎగబడుతున్నారు.