మునుగోడు : మునుగోడు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని పలు కార్మిక సంఘాలు శుక్రవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రమంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ కార్మిక సంఘంతో పాటు సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘాలు రెండు బృందాలుగా వీడి చౌటుప్పల్ మండలంలోని పారిశ్రామక ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు.
దండు మల్కాపూర్, తూప్రాన్ పేట, ఎస్. లింగోటం ప్రాంతాల్లోని వివిధ ఫ్యాక్టరీ లలో పనిచేస్తున్న కార్మికులను కలిసి సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని వివరించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న నిరంతర విద్యుత్ ను అందించడంతో పాటు, పరిశ్రమల ఏర్పాటు, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు అందిస్తున్న సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తో టీఎస్ ఐపాస్‌తో పరిశ్రమల అభివృద్ధి సాధ్యమైందని వెల్లడించారు. ఈ కార్యక్రమం లో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర, అధ్యక్ష కార్యదర్శులు రాంబాబు యాదవ్, నారాయణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, యాటా కృష్ణ, పాషా, ఇమ్రాన్, నందిశ్వర్ పాల్గొన్నారు.