హైదరాబాద్, సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు ప్రభుత్వం బకాయిపడ్డ 4 పెండింగ్ డీఏలను విడుదల చేయాలని టీపీటీఎఫ్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం ఏర్పడి 10నెలలు పూర్తయినా డీఏలను ప్రకటించకపోవ డం విడ్డూరమని, కనీసం శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో రెండు డీఏ లు ప్రకటిస్తారని ఆశించినా నిరాశే మిగిలిందని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వై అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శి పీ నా గిరెడ్డి ప్రకటనలో అభిప్రాయపడ్డారు.
అప్పీళ్లను ప్రకటించాలి: యూఎస్పీఎస్సీ
టీచర్ల బదిలీలు, పదోన్నతుల అప్పీళ్లను పరిష్కరించాలని ఉపాధ్యాయ సం ఘాల పోరాట కమిటీ(యూఎస్పీఎ స్సీ) ప్రభుత్వాన్ని కోరింది. బదిలీల ప్ర క్రియ ముగిసి 80 రోజులు గడుస్తున్నా ఇంతవరకు అప్పీళ్లను పరిష్కరించకపోవడం విడ్డూరమని పేర్కొంది. రెండువారాల్లో పరిష్కరిస్తామని ఇంతవరకు ప ట్టించుకోకపోవడంపై యూఎస్పీఎస్సీ నేతలు విస్మయం వ్యక్తంచేశారు. బదిలీలు, పదోన్నతుల్లో అక్రమాలపై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.