హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు తీయాలని, విలేకరుల సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపాలని కార్యకర్తలకు సూచించారు.
శనివారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. ‘ఏకకాలంలో రూ.2 లక్షలు రుణమాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అమలు చేస్తుంది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపైనా, ఇప్పుడు రుణమాఫీపైనా మాట నిలబెట్టుకున్నది. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తాం’ అని పేర్కొన్నారు.