హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ప్రైవేటు పరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. భూములు ప్రైవేటువ్యక్తి పరమవకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని చెప్పారు.
గురువారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మహేశ్‌కుమార్‌గౌడ్ హెచ్‌సీయూ వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితాసబర్వాల్ రీట్వీట్‌పై స్పందించారు. స్మితాసబర్వాల్ ఏ ఉద్దేశంతో రీట్వీట్ చేశారో ఆమెకే తెలియాలని పేర్కొన్నారు.