హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేయడం మానుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చే దిశలో తాను లేఖ రాస్తున్నట్టు వివరణ ఇచ్చారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు లేఖలో వివరించారు. కాగా ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతలు అధికార పక్షానికి లేఖలు రాయటం చూశాం గాని, అధికార పక్ష నేతలు ప్రతిపక్ష నేతలకు లేఖలు రాయటం ఆశ్చర్యంగా ఉన్నదని సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నది.