హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారంలోకి రావడం అసాధ్యమని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం మీడియాతో పలు అంశాలపై మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీకి కర్ణాటకలో ఉన్నంత బలం లేదని అభిప్రాయపడ్డారు.
బీజేపీ ఎన్ని గొడవలు చేసినా, ఎంతగా కొట్లాడినా ప్రజలు ఆ పార్టీని ఆదరించే పరిస్థితి లేదని స్పష్టంచేశారు. తెలంగాణ సామాజిక, రాజకీయ పరిస్థితులు బీజే పీ సిద్ధాంతాలకు అనుకూలం కాదని చె ప్పారు. తెలంగాణలో ఆ పార్టీ ఎప్పటికీ అధికారానికి ఆమడదూరంలోనే ఉంటుందని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో బీజేపీతోనే పోటీ ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో మరో రెండు డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి ఎంపిక ప్రక్రియ ఇంకా పెండింగ్‌లోనే ఉందని తెలిపారు.