హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయి. తెలంగాణ తొలి పాలకుడి ఆశయాలను రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ నీరుగార్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. ఈ పనికిమాలిన పాలనలో పల్లె ప్రగతి లేదు.. పట్టణ ప్రగతి లేదని విమర్శించారు. ముందుచూపు లేని ముఖ్యమంత్రితో రాష్ట్రానికే అతీగతీ లేదని దుయ్యబట్టారు. ‘పల్లె ప్రగతి’ వల్ల మొన్నటి దాకా మురిసిన పల్లెలు.. నేడు మురికి కూపాలను తలపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతితో పరుగులు తీసిన పట్టణాలు, నేడు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయని ఫైరయ్యారు.
ఒకప్పుడు పల్లె కన్నీరు పెడుతుంది అని పాడుకున్నాం.. ఇప్పుడు పట్టణాలు విలవిలలాడుతున్నాయని బాధపడే దుస్థితి దాపురించిందని విమర్శించారు. ఈ మార్పు మాకొద్దు అనే నినాదం మొదలైందని, కాంగ్రెస్ను కూకటివేళ్లతో పెకిలించే రోజు దగ్గరపడిందని ఎక్స్ వేదికగా చెప్పారు.
పనికిమాలిన పాలనలో పల్లె ప్రగతి లేదు.. పట్టణ ప్రగతి లేదు…
ముందుచూపు లేని ముఖ్యమంత్రితో రాష్ట్రానికే అతీగతీ లేదు
“పల్లె ప్రగతి” వల్ల మొన్నటి దాకా మురిసిన పల్లెలు..
నేడు మురికి కూపాలను తలపిస్తున్నాయి“పట్టణ ప్రగతి” తో పరుగులు తీసిన పట్టణాలు..
నేడు సమస్యలకు నిలయాలుగా… pic.twitter.com/T05a06LXWT— KTR (@KTRBRS) November 7, 2024
ఇక మరో ట్వీట్లో.. నారాయాణపేట-కొడంగల్ లిఫ్ట్ టెండర్ల ప్రక్రియ దొంగలు, దొంగలు కలిసి ఊళ్లు పంచుకునట్టు ఉందని మండిపడ్డారు. సగం మీ ప్రియ కాంట్రాక్టర్ మెఘా కిృష్ణా రెడ్డికి, మిగతా సగం మీ మంత్రిగారికీ పంపకాలు చేయడం మీకే చెల్లుతుందని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దొంగలు, దొంగలు కలిసి ఊళ్ళు పంచుకునట్టు ఉంది నారాయాణపేట-కొడంగల్ లిఫ్ట్ టెండర్ల ప్రక్రియ! సగం మీ ప్రియ కాంట్రాక్టర్ మెఘా కిృష్ణా రెడ్డికి, మిగతా సగం మీ మంత్రిగారికీ పంపకాలు చేయడం మీకే చెల్లుతుంది రేవంత్ రెడ్డి గారు!
Such a blatant disregard and utter disrespect for public… pic.twitter.com/bxvnljP7Ry
— KTR (@KTRBRS) November 7, 2024