మహదేవపూర్, జూన్ 15 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మి) బరాజ్ వద్ద ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. సెల్ఫీలు దిగుతూ సంబురపడ్డారు. కేసీఆర్ ముందు చూపుతోనే ప్రపంచంలో అద్భుతమైన ప్రాజెక్టు రూపుదిద్దుకున్నదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యంతో జలకళను సంతరించుకోవాల్సిన మేడిగడ్డ బరాజ్ ఎడారిని తలపించడం బాధగా ఉందని చర్చించుకున్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టి బరాజ్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
కేసీఆర్ గొప్ప వ్యక్తి
ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం. ఇంతటి గొప్ప ప్రాజెక్టు కట్టిన కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారు. ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టు నిరాదరణకు గురవుతున్నది. కేసీఆర్ సార్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారు. రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు. కేసీఆర్‌ను కొందరు కావాలని కించపరచడం సరికాదు.
– అడపోజు శ్రీనివాసాచారి, హైదరాబాద్