వికారాబాద్ : కోట్పల్లి ప్రాజెక్టులో(Kotpally project) పర్యాటకులు సందడి చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ముందుగా వికారాబాద్ పట్టణ పరిధిలోని అనంతగిరి కొండల్లోని అనంత పద్మనాభ స్వామి దర్శించుకున్న పర్యాటకులు, భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ధారూరు మండల పరిధిలోని కోట్ పల్లి ప్రాజెక్టులో పిల్లా పాపలతో కలిసి బోటింగ్ చేస్తూ ఆనందోత్సహాల మధ్య గడిపారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి సైతం అధిక సంఖ్యలో ప్యామిలీతో కలిసి వచ్చారు.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లోకి భక్తులు పోటెత్తుతున్నారు. నూతన సంవత్సరం రోజున తమ ఇష్ట దైవాన్ని దర్శించుకుని, అంతా శుభం జరగాలని భక్తులు కోరుకుంటున్నారు. ఇక భక్తుల తాకిడిని ముందే ఊహించిన ఆలయాల అధికారులు.. వారి రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, జోగులాంబతో పాటు ఇతర ఆలయాలకు భక్తులు బారులు తీరారు. దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. హైదరాబాద్ నగరంలోని చిలుకూరు బాలజీ టెంపుల్, బిర్లా మందిర్, పెద్దమ్మ తల్లి ఆలయం, జూబ్లీహిల్స్, హిమాయత్ నగర్లోని టీటీడీ ఆలయాలు, పద్మారావు నగర్లోని స్కంధగిరి టెంపుల్కు భక్తులు భారీగా తరలి వచ్చారు.
అనంత పద్మనాభ స్వామి ఆలయంలో భక్తుల క్యూ..
కోట్పల్లి ప్రాజెక్టులో పర్యాటకుల సందడి
బోటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు..
ఆశీర్వచనం తీసుకుంటున్న భక్తులు