Kotpally Project | ధారూరు, జూన్ 15 : ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టులో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం వారంతపు సెలవు కావడంతో ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ప్రాజెక్టు నీటిలో బోటింగ్ చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు. మండల నలుమూలల నుంచే కాకుండా జిల్లా చుట్టుప్రక్కల ప్రాంతాల వారు, వేరే ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి బోటింగ్ చేశారు. ప్రాజెక్టు నీటిలో బోటింగ్ చేస్తూ సరదాగా గడిపారు. సెలవు దినం కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చి కోట్ పల్లి ప్రాజెక్టు నీటిలో సరదాగా గడిపారు. బోటింగ్ అనంతరం ప్రాజెక్టు అందాలను తిలకించారు. సాయంకాలం పర్యాటకులు తమ తమ గమ్యాలకు తిరిగి వెళ్లారు.