Posani Krishna Murali | హైదరాబాద్ : రాయదుర్గం మైహోమ్ భుజాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టాలీవుడ్ డైరెక్టర్, నటుడు పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇప్పటికే పోసానిపై ఆంధ్రప్రదేశ్‌లో పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నారు. పోసాని అరెస్టుపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ పోలీసుల తీరు బాగోలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.