హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదులు, అర్జీల స్వీకరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుచేసింది.
92400 21456కు ఫోన్ చేయాలని సూచించింది. గ్రీవెన్స్ మాడ్యూల్ పేరిట ఆన్లైన్లో కూడా ఫిర్యాదులు స్వీకరించనున్నట్టు పేర్కొంది. tsec.gov.in లో గ్రీవెన్స్ మాడ్యూల్ ఐకాన్‌ను సెలెక్ట్ చేసుకోవాలని సూచించింది.