హుజూరాబాద్టౌన్, ఏప్రిల్ 26: తాటిచెట్టుపై నుంచి జారిపడి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ కల్లుగీత కార్మికుడిని తోటి కార్మికులు కాపాడారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ శివారులోని రంగనాయకుల గుట్ట సమీపంలోని వడ్డెర కాలనీ వద్ద జరిగింది.
కులవృత్తిలో భాగంగా పట్టణానికి చెందిన పూదరి చిన్న సమ్మయ్యగౌడ్ బుధవారం తాటిచెట్టు ఎకి కల్లు తీస్తున్న క్రమంలో మోకు అదుపుతప్పి వెనుకకు పడింది. కాళ్లకున్న గుది తాళ్లు అతన్ని కింద పడకుండా ఆపాయి. దీంతో అతడు తలకిందులుగా వేలాడుతూ కాపాడండి.. అంటూ కేకలు వేశాడు. సమీపంలోని తోటి గీత కార్మికులు వెంటనే చెట్టుపైకెకి అతడిని చాకచక్యంగా కిందికి దించడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది.