హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ క్యాబినెట్ స మావేశం వాయిదా పడింది. శుక్రవారం జరగాల్సిన క్యాబినెట్ సమావేశాన్ని ఈ నెల 12వ తేదీకి వాయిదా వేశారు. 12న మధ్యాహ్నం 3గంటలకు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగనున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రులు బిజీ గా ఉండటం, స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో శుక్రవారం జరగాల్సిన క్యాబినెట్ సమావేశం వాయిదా పడినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
12న జరిగే క్యాబినెట్ సమావేశంలో గిగ్వర్కర్స్ బిల్లుతోపాటు పలు కీలక అంశాలను ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉన్నట్టు సమాచారం.