కాబోయే భర్తలో ఉండాల్సిన గుణగణాలేమిటని కథానాయికల్ని అడిగితే పెద్ద లిస్ట్ చెబుతుంటారు. అందగాడై ఉండాలి, హాస్యచతురత, పాజిటివ్ ఆటిట్యూడ్ కలిగి ఉండాలంటూ కోరికల చిట్టా విప్పుతుంటారు. జీవితభాగస్వామి విషయంలో కూర్గ్ సుందరి రష్మిక మందన్న భిన్నమైన కోరికను వ్యక్తంచేసింది కాబోయే భర్త తమిళనాడుకు చెందినవాడై ఉండాలని చెప్పింది. తన పెళ్లి గురించి రష్మిక మందన్న మాట్లాడుతూ ‘దక్షిణాది రాష్ర్టాల్లో తమిళనాడు నా మనసుకు నచ్చిన ప్రాంతం. ఇక్కడి సంస్కృతులు సంప్రదాయాలు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. స్వతహాగా నేను భోజనప్రియురాలిని. ఈ ప్రాంత ఆహారపదార్థాల రుచి బాగుంటుంది. తమిళ ఫుడ్ ఐటెమ్స్‌ను ఇష్టంగా భుజిస్తుంటా. అన్ని కుదిరితే కోడలిగా తమిళ ఇంట్లో అడుగుపెట్టాలనుంది’ అని చెప్పింది.