హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12.30 జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు.