తెలంగాణ కోసమే పుట్టి.. తెలంగాణను సాధించిన ఇంటిపార్టీ 25 ఏండ్ల పండుగ సందర్భంగా తెలంగాణ గులాబీ తోటలా మారింది. ఆదివారం జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ జాతరకు ఓరుగల్లులో బాహుబలి వేదిక కనీవినీ ఎరుగని రీతిలో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ‘చలో వరంగల్’ అంటూ మహాసభ వైపు సాగుతున్న రహదారులన్నీ గులాబీ సేనల ఈలలు.. ‘జై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తుతున్నాయి. ‘గులాబీ జెండా పట్టి.. బండెనక బండి కట్టి..’ ఎడ్లబండ్లు మొదలు తీరొక్క వాహన శ్రేణులన్నీ రయ్యిరయ్యిన గులాబీ సంబురానికి దూసుకుపోతున్నాయి.
కాంగ్రెస్ గ్యారెంటీల గారడీలో ఆగమైన రైతన్నలు.. రైతు కూలీలు.. దగాపడ్డ ఆడబిడ్డలు.. ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ ఆటోడ్రైవర్లు.. ‘కొలువుల కల’ చెదిరిపోయిన నిరుద్యోగులు.. వంచనకు గురైన
చిరుద్యోగులు.. కార్మికులు సహా సబ్బండ వర్ణాలవారు రాష్ట్రం నలుమూలల నుంచీ స్వచ్ఛందంగా సభకు
బైలెళ్లుతున్నారు. ఊరూరా.. వాడవాడలా బీఆర్ఎస్ జెండాలను ఎగరేసి సభా ప్రాంగణం ఎల్కతుర్తి వైపు గులాబీ సైనికులు కదులుతున్నారు. ‘మార్పు’ అంటూ నమ్మి ఎన్నుకున్న సర్కారు పాలనలో ఆశలు సన్నగిల్లిన జనమంతా ఆర్తిగా సభా వేదిక పైనుంచి జననేత కేసీఆర్ చూపే దశదిశ కోసం ఎదురుచూస్తున్నారు.
కరీంనగర్‌లోని కోతిరాంపూర్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి దిష్టి తీసి గుమ్మడికాయ కొడుతున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, గందె మాధవి, బీఆర్ఎస్ నాయకులు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రజతోత్సవ సంబురాల్లో భాగంగా గులాబీ టీ షర్టులు ధరించి, చలో వరంగల్ ప్లకార్టులు పట్టుకున్న మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, పార్టీ నాయకులు, కార్యకర్తలు
బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాలను లండన్‌లో నిర్వహిస్తున్న ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి,యూకే ఉపాధ్యక్షులు హరి, సతీశ్‌రెడ్డి, సత్యమూర్తి, రవికుమార్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్, నాయకులు గణేశ్, సురేశ్, రవి ప్రదీప్. రమేశ్
సూర్యాపేట నుంచి ఎడ్లబండ్ల ర్యాలీగా వచ్చిన వారిని వరంగల్ హంటర్ రోడ్లో సన్మానిస్తున్న బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 25 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన కారు విగ్రహం. పక్కన జాగృతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్‌రెడ్డి
బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు సాయిచరణ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి ఎల్కతుర్తికి బయలుదేరిన గులాబీ రంగు అంబాసిడర్ కార్లు
మందమర్రి పట్టణంలో బైక్‌ర్యాలీలో పాల్గొన్న మాజీ విప్ బాల్క సుమన్, యువ నాయకుడు విజిత్‌రావు, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ @ 25 సంబురాల ఫ్లెక్సీ
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ సభకు రాష్ట్రవ్యాప్తంగా ఆటో యూనియన్ నాయకులు జైకొడుతున్నారు. పలు ప్రాంతాల్లో యూనియన్ నాయకులు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. గులాబీ జెండాను గుండెల నిండా నింపుకొని ఆదివారం నిర్వహించే రజతోత్సవ సభకు దండులా కదిలిన వరంగల్ జిల్లాకు చెందిన ఆటో యూనియన్ నాయకులు