HomeTelanganaToday Farmers Accounts Are Getting Paid
నేను రైతునైనందుకు గర్వపడుతున్నా!
నా పేరు దేవిరెడ్డి అనంతరెడ్డి. ములుగు జిల్లా ములుగు మండలం చిన్నగుంటూరుపల్లి గ్రామ రైతును.
నాడు బినామీలు దోచుకునేటోళ్లు
నేడు రైతుల ఖాతాల పైసలు పడుతున్నయి
అప్పులు తెచ్చుడు బంద్ అయ్యింది
ములుగు రైతు దేవిరెడ్డి అనంతరెడ్డి విజయగాథ
నా పేరు దేవిరెడ్డి అనంతరెడ్డి. ములుగు జిల్లా ములుగు మండలం చిన్నగుంటూరుపల్లి గ్రామ రైతును. రైతును అని చెప్పుకునేందుకు గర్వంగా ఉన్నది. నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు.. నేను రైతుగానే చెబుతున్న.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రైతుల పథకాలన్నీ పైరవీలతోటి నడిసినయ్. నాయకులు బినామీలుగా మారి ఫాయిదా పొందేటోళ్లు. రైతుకు దక్కాల్సిన ఆ కాస్త సాయాన్ని కూడా దోచుకునేటోళ్లు. ఇప్పుడు ఎటువంటి పైరవీల్లేవ్. నాయకుల జోక్యం లేకుండా రైతుల అకౌంట్లలో రైతుబంధు సాయం పడుతున్నది. భూమి ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు పథకం రావడం ఎంతో గొప్ప విషయం. తెలంగాణలో రైతులకు చానా లాభమైతంది.
ములుగు, జనవరి 1 (నమస్తేతెలంగాణ): నా పేరు దేవిరెడ్డి అనంతరెడ్డి. ములుగు జిల్లా ములుగు మండలం చిన్నగుంటూరుపల్లి గ్రామ రైతును. రైతును అని చెప్పుకునేందుకు గర్వంగా ఉన్నది. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. నేను చెప్పేది రైతుగా చెబుతున్నా. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ఇచ్చే పథకాలు పైరవీలతోని నాయకులు బినామీలుగా మారి పథకాలు పొందే వారు. రైతుకు రావాల్సిన కాస్తా సాయాన్ని కూడా వాళ్లే దోచుకునేటోళ్లు. ఇప్పుడు పైరవీలు, నాయకుల జోక్యం లేకుండా రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు సాయం పడుతున్నది.
భూమి ఉన్న ప్రతీ రైతుకు రైతుబంధు పైసలు రావడం గొప్ప విషయం. తెలంగాణలో రైతు పరంగా చానా లాభం అయింతంది. నాతోపాటు గ్రామంలో రైతులందరికీ రైతుబంధు సాయం పడుతుంది. గ్రామంలో నా పేరు మీద 4 ఎకరాలు, నా భార్య పేరు మీద రెండు ఎకరాల పొలం ఉన్నది. రెండురోజుల క్రితం మా ఇద్దరి అకౌంట్లల్ల రూ.30 వేలు పడ్డయి. నాకున్న 6 ఎకరాలతోపాటు మరింత భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న. ప్రతీ సంవత్సరం యాసంగి, వానకాలం కలుపుకొని రూ.60 వేలు రైతుబంధు కింద అందుతున్నాయి.
అప్పులు తెచి పండించేటోళ్లం
గతంలో పెట్టుబడి కోసం రూ.లక్ష వరకు అప్పు తెచ్చి వ్యవసాయ పనులు చేసేటోళ్లం. యాడాదికి తెచ్చిన అప్పునకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు మిత్తి కట్టాల్సి వచ్చేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతులను బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. వాళ్లకాడ, వీళ్లకాడ అప్పులకు తిరుగుడు బంద్ అయ్యింది. నాకు ఆసరా పింఛన్ రూ.2 వేలు వస్తున్నాయి. నా కోడలికి కేసీఆర్ కిట్టు వచ్చింది. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి ఏదో ఒక విధంగా పథకాలు అందుతున్నాయి. కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు కూడా లబ్ధిపొందుతున్నారు. ప్రభుత్వంపై పనిగట్టుకొని విమర్శించుడు తప్పా ఏమి లేదు. రాజకీయంగా ఎదిగేందుకే విమర్శలు.
విమర్శించే వాళ్లకు పథకాలు అందుతలేవ్వా? సీఎం కేసీఆర్ పాలన బాగుంది. రైతులకు కరెంట్, నీళ్ల సౌలత్ కూడా బాగుంది. గతంలో జియాలజిస్ట్లను పొలాల కాడా తిప్పి బోర్లు ఏ ప్రాంతంలో పడ్తయోనని తిప్పలు పడేటోళ్లం. నాలుగైదేండ్ల సంది భూగర్భ జలాలు పెరిగి ఎక్కడ బోరు వేసినా నీళ్లు పడుతున్నయి. రైతులకు నీళ్ల బాధతోపాటు కరెంట్ బాధ తప్పింది. పథకాలు తినుకుంటా కూడా పార్టీ పరంగా విమర్శిస్తారు. వాటిని పక్కకు పెట్టాలే. సీఎం కేసీఆర్ లాంటి నాయకుడిని నేను ఇప్పటివరకు సూడలే. ఇది నా ఒక్కని అభిప్రాయం కాదు. జనం అందరి ముచ్చట. రైతుపరంగా, వ్యక్తిపరంగా పరిపాలన దగ్గరగా ఉన్నది. ఎప్పుడు పరిపాలన ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నా. కేసీఆర్ పాలనలో ఏ బాధలు లేవు.