బుమ్రాకు ఆ నష్టాన్ని పూడ్చటమెలా?
టీమ్ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా సెంట్రల్ కాంట్రాక్టుపై బీసీసీఐ పునరాలోచనలో పడిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. కొద్దిరోజుల క్రితమే బోర్డు ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల్లో బుమ్రాను ‘ఏ+’ క్యాటగిరీ నుంచి ‘ఏ’కు మార్చిన విషయం తెలిసిందే.
- ఏ+ క్యాటగిరీ తీసేయడంతో రూ. 2 కోట్ల నష్టం
ముంబై : టీమ్ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా సెంట్రల్ కాంట్రాక్టుపై బీసీసీఐ పునరాలోచనలో పడిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. కొద్దిరోజుల క్రితమే బోర్డు ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల్లో బుమ్రాను ‘ఏ+’ క్యాటగిరీ నుంచి ‘ఏ’కు మార్చిన విషయం తెలిసిందే. గత సీజన్ వరకూ ‘ఏ+’ గ్రేడ్ అనుభవించిన బుమ్రా.. యేటా రూ. 7 కోట్ల వార్షిక వేతనం పొందేవాడు. కానీ ‘ఏ’కు మార్చడంతో అది కాస్తా రూ. 5 కోట్లు మాత్రమే పొందుతాడు. రోహిత్, కోహ్లీ టెస్టు, టీ20ల నుంచి తప్పుకోవడంతో బీసీసీఐ.. ‘ఏ+’ గ్రేడ్‌ను తొలగించి ‘ఏ’ను మాత్రమే ఉంచింది. వీటిలో బుమ్రా, జడేజాతో పాటు కొత్త కెప్టెన్ గిల్ చేరాడు. అయితే కాంట్రాక్టులు ప్రకటించినప్పుడు బీసీసీఐ.. ఏ గ్రేడ్‌కు ఎంత? అన్నదానిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు.
అయితే మూడు ఫార్మాట్లలో ఆడుతూ భారత జట్టు కీలక ఆటగాళ్లలో ఒకడైన బుమ్రాకు రూ. 2 కోట్లు తగ్గించడం సరైంది కాదన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ.. అతడికి పరిహారాన్ని ఎలా సర్దుబాటు చేయాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నది. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘బుమ్రాకు పరిహారాన్ని ఎలా సర్దుబాటు చేయాలనేదానిపై చర్చిస్తున్నాం. జట్టులో కొంతమంది ఏడాది పొడవునా మెరుగైన ప్రదర్శనలు చేసినప్పటికీ వారి గ్రేడ్ తగ్గింది. కాంట్రాక్టుల్లో సవరణలు జరిగే అవకాశం లేకపోలేదు’ అని తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

