హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈరోజు సాయంత్రం 5 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి(Tirupati) వెళ్లనున్నారు. రాత్రి తిరుమలలో(Thirumala) బస చేసి, బుధవారం ఉదయం వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం హైదరాబాద్కు తిరిగి రానున్నారు. కాగా, సీఎం తిరుమల పర్యటనతో నేడు రేవంత్ రెడ్డి పలు శాఖలపై నిర్వహించాల్సిన సమీక్షలు, ఇతర కార్యక్రమాలు రద్దయినట్లు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పరిశ్రమల శాఖతో నిర్వహించనున్న సమీక్షను సీఎం రద్దు చేసుకున్నారు.