వనపర్తి : తెలంగాణ వజ్రోత్సవ సంబురాలను విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ
మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ వజ్రోత్సవ వేడుకలపై పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో బుధవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈనె 16వ తేదీ ఉదయం జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుంచి మెడికల్ కళాశాల వరకు ర్యాలీ.. అనంతరం మధ్యాహ్న భోజనం ఉంటుందన్నారు.
ఈ ర్యాలీకి పెద్దఎత్తున యువత, ప్రజలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. 17వ తేదీన కలెక్టరేట్ లో జాతీయజెండా ఆవిష్కరణ 18న కవి సమ్మేళనాలు ఉంటాయన్నారు.
తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన నేపథ్యంలో వజ్రోత్సవ సంబురాలు మూడు రోజుల పాటు ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, తెలంగాణ అభిమానులు ఈ సంబురాల్లో పాల్గొనడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు.