శేరిలింగంపల్లి, ఆగస్టు 4: న్యాయం జరిగే వరకూ అందోళన కొనసాగుతుందని భాగ్యనగర్ టీఎన్జీవోస్ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో గోపన్‌పల్లిలో కొనసాగుతున్న భాగ్యనగర్ టీన్జీవోల ఆందోళన 20వ రోజుకు చేరింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళనలో పాల్గొంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ గాంధేయ పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం దురదృష్టకరమని తెలిపారు. 20 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా పట్టించుకునే వారేలేరని చెప్పారు.
ప్రభుత్వం తమ సమస్యపై దృష్టిసారించి పరిష్కరించాలని కోరారు. ఓ వైపు నిరసన కొనసాగిస్తూనే మరోవైపు న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజేశ్వర్‌రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, రషీదా బేగం, సంధ్య, నర్సింహారాజు, ఎక్నాథ్ గౌడ్, నాయక్, దామోదర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.