శేరిలింగంపల్లి, ఆగస్టు 19: తెలంగాణ ఉద్యోగ సంఘాలకు కేటాయించిన భూములను ఎట్టిపరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళన మంగళవారం 35వ రోజుకు చేరింది. గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవోస్ కార్యాలయం వద్ద పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు రోజుకో తీరులో నిరసన తెలుపుతూ.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తమ భూములు తమకే కావాలని, కబ్జాదారుల నుంచి కాపాడాలని కోరుతున్నారు. బీటీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ ఆధ్వర్యంలో కొనసాగుతన్న ఆందోళనలో ఉద్యోగ నేతలు, ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు.