TNGO-PRC | పీఆర్సీ నియామకంపై సీఎం కేసీఆర్కు టీఎన్జీవోస్ కృతజ్ఞతలు..!
TNGO-PRC | రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు వేతన సవరణ కోసం నూతన వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ని ఏర్పాటు చేసినందుకు సీఎం కే చంద్రశేఖర్ రావుకు టీఎన్జీఓస్ కేంద్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.
TNGO-PRC | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే రివిజన్ కమిటీని (పీఆర్సీ) నియమించాలని నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకి టీెఎన్జీవోస్ కేంద్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్సీ కమిటీ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ ఎన్ శివశంకర్, సభ్యుడిగా రిటైర్డ్ ఐఏఎస్ బీ రామయ్యలను నియమించడంతోపాటు ఇంటెరిం రిలీఫ్ ప్రకటించినందుకు రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మామిళ్ళ రాజేందర్, మారం జగదీశ్వర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గతంలో రెండు పీఆర్సీలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే ఉందని మామిళ్ళ రాజేందర్, మారం జగదీశ్వర్ పేర్కొన్నారు. వచ్చే పీఆర్సీలో కూడా ఉద్యోగుల ఆకాంక్షల మేరకు మంచి ఫిట్మెంట్తో నూతన వేతన సవరణ ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులంతా ప్రభుత్వ ఆకాంక్షల మేరకు కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
త్వరలో సీఎం కేసీఆర్ను కలిసి మెరుగైన ఇంటరీమ్ రిలీఫ్ విడుదల చేయాలని, ఉద్యోగుల మిగతా సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతామని మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్ తెలిపారు. ఆరోగ్య కార్డులు (ఈహెచ్ఎస్), కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, డీఏ తదితర పెండింగ్ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటామన్నారు. ఉద్యోగుల ఆకాంక్షల మేరకే మెరుగైన పీఆర్సీ ప్రకటించి, అన్ని సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

