హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ ఉద్యోగులకు వయసుతో నిమిత్తం లేకుండా పదోన్నతులు కల్పించాలని టీఎన్జీవో, టీజీవో నేతలు ప్రభుత్వాన్ని కోరారు. టీఎన్జీవో, టీజీవో ప్రతినిధులు బుధవారం సచివాలయంలో మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం సమర్పించారు.
45 ఏండ్ల నిబంధనను తొలగించి అంగన్వాడీలకు పదోన్నతులు కల్పించాలని నేతలు కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో టీఎన్జీవో కేంద్రం సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ, అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణగౌడ్, పర్వతాలు, హరికృష్ణ, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కిషన్, కార్యదర్శి శేఖర్ తదితరులు ఉన్నారు.