తిరుమలగిరి, జనవరి 28 : సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ఎస్ఐ, కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. తుంగతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12న సిద్దిపేట జిల్లా వడ్డేపల్లికి చెందిన రత్నాకర్ వాహనంలో పీడీఎస్ బియ్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రత్నాకర్ పారిపోవడంతో అతడి అన్న, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేశారు. కేసు లేకుండా చేయడానికి ఎస్ఐ ఉక్కుర్తి సురేశ్ 3 లక్షలు లంచం డిమాండ్ చేసి, ఈ నెల 25న ఫోన్‌పే ద్వారా 40వేలు తీసుకున్నారు. మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో చంద్రశేఖర్ ఏసీబీని ఆశ్రయించారు. మంగళవారం ఎస్ఐ సురేశ్.. కానిస్టేబుల్ నాగరాజు ద్వారా రూ.లక్ష లం చం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఏసీబీ డీఎస్పీ జగదీశ్చంద్ర తెలిపారు.
హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ఆదివాసీల అతిపెద్ద జాత ర నాగోబా.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ వైభవానికి ప్రతీక అని ఎమ్మెల్సీ కవిత అభివర్ణించారు. ఈ మహా పండుగ ప్రారంభమవుతున్న శుభవేళ ఆదివాసులకు శుభాకాంక్షలు తె లుపుతూ మంగళవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఆ ఆదిశేషువు ఆశీస్సులు ప్రతిఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.