హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధులు బుధవారం ఫిర్యాదు చేశారు. క్యూన్యూస్‌లో ఈ నెల 13న సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని తెలిపారు.
మల్లన్న మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని, మీడియా ముసుగులో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏసీపీ శ్రీధర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు. ఫిర్యాదు ఇచ్చినవారిలో రఘువీర్ రాథోడ్, పేరోళ్ల విజయ్‌కుమార్, శ్రీనునాయక్, మోహన్ తదితరులు ఉన్నారు.