హైదరాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ): రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై రైతులు చేసుకున్న దరఖాస్తులను నిర్దేశించి గడువులోగా పరిషరించాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. భూ సమస్యల పరిషారమే లక్ష్యంగా ఈ నెల 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 561 మండలాల్లో 7,578 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సదస్సుల్లో 4.61 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించారు.