RGIA | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. సీఐఎస్ఎఫ్ బలగాల పర్యవేక్షణలో శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద నిఘా పెంచారు. డేగ కళ్లతో సీఐఎస్ఎఫ్ బలగాలు విమానాశ్రయానికి భద్రత కల్పిస్తున్నాయి. శాంతి భద్రతల విభాగం, ఇంటెలిజెన్స్, ఎస్బీ పోలీసుల సమన్వయంతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఎయిర్పోర్టు చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రయాణికులు 3 గంటల ముందే ఎయిర్పోర్టుకు రావాలని సూచించారు. పౌర విమానయాన శాఖ ఆదేశాలతో ప్రయాణికులను సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది. శ్రీనగర్, అమృత్ సర్, జోధ్పూర్, చండీగఢ్, రాజ్కోట్ వెళ్లే విమానాలను ర్దు చేశారు.