భీంపూర్, నవంబర్ 5: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్‌కోటి రిజర్వాయర్ పరిసరాల్లో శనివారం అర్ధరాత్రి మరోసారి పెద్ద పులి సంచరించింది. రిజర్వాయర్ వద్ద వాహనాల మరమ్మతులు చేస్తున్న సిబ్బందికి జంతువులను తరుముతున్న పెద్దపులి కనిపించింది. వారు భయంతో వాహనాలు ఎక్కి వీడియో తీశారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆదివారం అక్కడికి వెళ్లి పరిశీలించారు.
ఈ ప్రాంతంలో పెద్దపులి వారం వ్యవధిలో రెండు పశువులను చంపింది. రిజర్వాయర్‌కు సమీపంలో ఉన్న హత్తిఘాట్ ప్రాంతంలో పులి శనివారం ఒక ఆవుదూడను హతమార్చినట్టు.. పెన్‌గంగ పరీవాహక ప్రాంతంలోనే ఈ పెద్దపులి సంచరిస్తున్నట్టు తెలుస్తున్నది.