79 వేల ఉపాధి కూలీలకు టిఫిన్ బాక్స్‌లు
పాలకుర్తి నియోజకవర్గంలో పనిచేస్తున్న 79 వేల మంది ఉపాధిహామీ కూలీలకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ తరఫున టిఫిన్ బాక్స్‌లు అందజేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.
- రూ.2 కోట్లతో ట్రస్ట్ ద్వారా పంపిణీ
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడి
- ఐటీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజున పంపిణీ ప్రారంభం
దేవరుప్పుల, జూలై 24: పాలకుర్తి నియోజకవర్గంలో పనిచేస్తున్న 79 వేల మంది ఉపాధిహామీ కూలీలకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ తరఫున టిఫిన్ బాక్స్‌లు అందజేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. సోమవారం జనగామ జిల్లా దేవరుప్పులలో నిర్వహించిన ఉపాధిహామీ కూలీల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గంలో మొత్తం 79వేల మంది ఉపాధిహామీ కూలీలు పనిచేస్తున్నారని, వారి అవసరాల దృష్ట్యా ప్రతి కూలీకి తన ట్రస్ట్ ద్వారా రూ.260 విలువైన బ్యాగు, స్టీల్ వాటర్ బాటిల్, టిఫిన్ బాక్స్ అందజేస్తున్నట్టు చెప్పారు. కూలీలు ఉపాధి పనులు చేస్తున్నప్పుడు పలు సందర్భాల్లో వారిని కలిశానని, వారు గుడ్డలు, పలిగిన బాక్సుల్లో అ న్నం తెచ్చుకోవడం చూశారని, వారికి శాశ్వతంగా ఉండేలా ఈ కిట్లు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించామని, టిఫిన్ బాక్స్‌లు అందజేసి బర్త్‌డే వేడుకలు నిర్వహించామని పేర్కొన్నారు. గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయడం వల్ల ఆరోగ్యం పెరిగిందని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

