హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ సందర్భంగా స్పెషల్ బస్సులకు ఐదు రోజులపాటు టికెట్ ధరలను సవరించినట్టు టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ప్రధాన పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిపే ప్రత్యేక బస్సులు నడిపేందుకు డీజిల్ ఖర్చులు, నిర్వహణ కోసమే టికెట్ ధరలు పెంచినట్టు శనివారం తెలిపింది.
2023లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 16 ప్రకారమే నిర్ణయం తీసుకున్నామని, ప్రయాణికులు సహకరించాలని కోరారు.