హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డిని టిబెట్ ప్రతినిధి బృందం కలిసింది. బుధవారం తెలంగాణ భవన్లో ఎంపీతో టిబెట్‌కు చెందిన ఎంపీలు అటూక్ టిస్టేన్, టెసిరింగ్ యంగ్చెన్, దొండూప్ టాస్మి సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా టిబెట్ బృందం అభిప్రాయపడింది.