హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగా ణ): బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ నేత కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం ముమ్మాటికీ రాజకీయ కక్షేనని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు విమర్శించారు. హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ పాలకులకు కేసీఆర్ అనే మూడక్షరాలే టార్గెట్ అని ధ్వజమెత్తారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. కాంగ్రెస్ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను, హామీలపై ప్రజల దృష్టిని మళ్లించడానికే ‘డైవర్షన్ గేమ్స్’ ఆడుతున్నదని వి మర్శించారు. ఎవరెన్ని చేసినా కాం గ్రెస్ గ్రాఫ్ పెరిగేది లేదని, కేసీఆర్ ముద్ర చెరిగేదీ కాదని స్పష్టంచేశారు.