హైదరాబాద్ : రాబోయే 2 గంటల్లో తెలంగాణ ( Telangana ) లోని పలు జిల్లాలో వర్షాలు ( Rains ) పడుతాయని తెలంగాణ వాతావరణ శాఖ అధికారి బాలాజీ తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్( Adilabad ) , నిర్మల్ ( Nirmal ) , సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి – భువనగిరి, జనగాం, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాల్లో చెదురుముదురుగా తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇవి విస్తృతమైన తుఫానులుగా మారే అవకాశం ముందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మధ్యాహ్నం 2 గంటల తర్వాత రంగారెడ్డి, నల్గొండ, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత దక్షిణ హైదరాబాద్లో ఉరుములతో కూడిన వర్షాలు ఏర్పడి, ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయని పేర్కొన్నారు.