ఖమ్మం : జిల్లాలోని దానవాయిగూడెం వద్ద నాగార్జున సాగర్ కాలువలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. స్థానికంగా ఉన్న కేరళ ఆయుర్వేద ఆసుపత్రిలో పని చేస్తున్న ఏడుగురు యువకులు కలిసి ఆదివారం సరదాగా ఈత కోసం కాలువలోకి వెళ్లారు. నీటిలో సోను, అభయ్‌తో పాటు మరో యువకుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు.