నిర్మల్ : విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ముగ్గురు ఉపాధ్యాయులపై(Teacher misbehaves) వేటు పడింది. నిర్మల్(Nirmal ) జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లతో పాటు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు టీచర్లను, అలాగే ఘటనను ఉన్నతాధికారులకు తెలియజేయడంలో నిర్లక్ష్యం వహించిన ప్రధానోపాధ్యాయున్ని సస్పెండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..