హైదరాబాద్ : వనపర్తి జిల్లాలో(Wanaparthi district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. సాధువులపై ఓ డీసీఎం దూసుకెళ్లడంతో ముగ్గురు సాధువులు మృతి(Saints died) చెందారు. ఈ విషాదకర సంఘటన వననపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..పెబ్బేరు నుంచి కర్నూలు వైపు గుజరాత్‌కు(Gujarat) చెందిన సాధువుల బృందం నడుచుకుంటు వెళ్తున్నది. ఇదే క్రమంలో ఓ డీసీఎం వారిని కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.